పాలిచ్చే తల్లులు డైట్ లో వీటిని తీసుకోండి..!

-

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటం కోసం పోషకాహారం తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు ( Breast Feeding Mother )  తమ డైట్ లో మంచి ఆహారం తీసుకోవాలి లేదు అంటే పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది. అయితే పాలిచ్చే తల్లులు స్పెషల్ ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మంచి పోషకాహారం, సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ ఉంటే మంచిది.

Breast Feeding Mother | పాలిచ్చే తల్లుల్లు
Breast Feeding Mother | పాలిచ్చే తల్లుల్లు

పాలిచ్చే సమయంలో క్యాల్షియం, ఐరన్ ఎక్కువగా తీసుకునేటట్లు చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎటువంటి ఆహార పదార్థాలలో మంచి పోషక పదార్థాలు ఉంటాయి..?, ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పాలిచ్చే తల్లులు డైట్ లో అన్ని రకాల ఆహార పదార్ధాలు తీసుకోవడం చాలా ముఖ్యం. బెల్లం, కూరగాయలు, పండ్లు, పాలు మరియు పాల పదార్థాలు డైట్ లో ఉండేటట్లు చూసుకోండి. అలానే ఆకుకూరలు, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అటుకులు, దానిమ్మ, ఎండు ద్రాక్ష కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అంటే పాలు, పాల పదార్థాలు, రాగులు, జామపండ్లు. పెరుగు, పన్నీర్ కూడా మంచిది. అలానే రోజుకి మూడు నుండి నాలుగు సార్లు ఆహారం తీసుకుంటూ ఉండాలి. దానితో పాటుగా రోజుకు కనీసం రెండు నుండి మూడు లీటర్లు నీళ్లు తాగాలి.

సొయా మిల్క్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అదే విధంగా పాలిచ్చే తల్లులు విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం ముఖ్యం. ఇలా పాలిచ్చే తల్లులు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. అదే విధంగా శిశువులకు కూడా మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news