ముద్దుతో బీపీ, షుగర్‌ కూడా తగ్గుతుంది తెలుసా..? కాసింత ముద్దూ మచ్చట ఉండాల్సిందే..!

-

రొమాన్స్‌లో భాగంగా ముద్దు ముచ్చట ముందు ఉంటాయి. ప్రేమికులు గానీ, దంపతులు కానీ మనసారా ఒక ముద్దు పెట్టుకుంటే ఎంత ప్రజర్‌ అయినా ఇట్టే తీరిపోతుంది. ముద్దు వల్ల మానసిక ప్రశాంతత, ఆనందం వస్తుంది అని తెలుసు కానీ రోగాలు కూడా నయం అవుతాయని మీకు తెలుసా..?
ముద్దుతోనూ పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయం చాలామందికి తెలియదు. అవును.. మీరు చదివింది నిజమే. ముద్దు పెట్టుకున్నప్పుడు శరీరంలో జరిగే రసాయనిక మార్పులతో ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

బీపీని తగ్గించే ముద్దు

బీపీని తగ్గించే ముద్దు అని చదవగానే ముద్దుకు కూడా బీపీని తగ్గిస్తుందా అనుకుంటున్నారా..? డయాబెటిస్‌ని తగ్గించే ముద్దు కూడా ఉంది తెలుసా..? ముద్దు పెట్టుకోవడం వల్ల బీపీ తగ్గి నార్మల్ అవుతుంది అని. ముద్దు పెట్టుకునే క్రమంలో మనిషి శరీరంలో రక్తనాళాలు వెడల్పుగా తయారవుతాయి. దీంతో రక్త ప్రసరణ సులువు అవుతుంది.

నొప్పి నివారిణి

ముద్దు పెట్టుకున్నప్పుడు శరీరంలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి మనిషికి అలసటను దూరం చేసి హాయిని ఇవ్వడమే కాకుండా నొప్పి నివారిణిగానూ పనిచేస్తాయట. అంతేకాకుండా రక్త ప్రసరణ నార్మల్ అవడం వల్ల శరీరంలో తిమ్మిర్లు, తలనొప్పి వంటి సమస్యలు నుంచి కూడా రిలాక్సేషన్ పొందవచ్చు.

పుప్పి పళ్లు రాకుండా చేసే ముద్దు

మీరు మీ పార్ట్‌నర్‌ని ముద్దు పెట్టుకున్నప్పుడు మీ నోట్లో లాలాజలం విడుదల అవుతుంది. అలా విడుదలయ్యే లాలాజలం దంతాల మధ్య పేరుకుపోయిన పాచిని తొలగించి పుప్పి పళ్లు రాకుండా చేస్తుందట.

హ్యాపీ హార్మోన్స్ విడుదల

ముద్దు పెట్టుకున్నప్పుడు శరీరంలో ఎండార్ఫిన్స్, ఆక్సీటోసిన్ అనే హ్యాపీ హార్మోన్స్‌ని విడుదల చేస్తాయి. ఇవి మనిషిని సంతోషంగా ఉంచడానికి సహాయం చేస్తాయి.

ముద్దు పెట్టుకునేటప్పుడు పెరిగే హార్ట్ రేట్, మజిల్ యాక్టివిటీ వల్ల ఒంట్లో కొన్ని కేలరీలు ఖర్చు అవుతాయి. ఇది కూడా ఆరోగ్యానికి మంచిదే.

ముద్దుతో పెరిగే ఆత్మవిశ్వాసం

ముద్దు పెట్టుకునే క్రమంలో కలిగే చనువుతో ఇద్దరి మధ్య బంధం మరింత ధృడపడుతుంది. ఇది మీ పట్ల, మీ బంధం పట్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సెక్స్‌ అంటే రొమాన్స్‌ వల్లే మీరు మీ లైఫ్‌ పార్ట్నర్‌కు బాగా దగ్గరవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news