ఒక్కొక్కసారి మనకు ఎక్కిళ్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి అటువంటి సమయంలో ఎక్కిళ్ళు ఎక్కవవకుండా తగ్గించుకోవాలంటే ఈ ఇంటి చిట్కాలు బాగా ఉపయోగపడుతాయి. ఎక్కిళ్ళను తగ్గించుకోవడానికి ఇవి చాలా ఈజీ మెథడ్స్. మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం.
నీళ్లు తాగండి:
ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల కూడా ఎక్కిళ్లు నుంచి రిలీఫ్ పొందొచ్చు. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారిలో ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తుంటాయి.
నిమ్మరసం చెక్కెర:
కొద్దిగా నిమ్మరసంలో పంచదార మిక్స్ చేసి తీసుకుంటే కూడా వెంటనే ఎక్కిళ్లు నుండి ఉపశమనం లభిస్తుంది.
మోకాళ్ళతో ఛాతిని తాగండి:
ఎక్కువగా ఎక్కిళ్ళు వస్తున్నట్లయితే మోకాళ్ళతో చేతులు తాకేందుకు ప్రయత్నం చేయండి. నేల పై కూర్చుని ఇలా ఐదు నిమిషాల పాటు ఉంటే కచ్చితంగా మీరు రిలీఫ్ ని పొందొచ్చు.
మీ దృష్టిని మార్చండి:
కొన్ని కొన్ని సార్లు పరధ్యానంలో ఉండడం వల్ల కూడా ఎక్కిళ్లు తగ్గిపోతాయి కాబట్టి మీ దృష్టిని మళ్ళించడం మంచిది. ఇలా చేస్తే త్వరగా ఎక్కిళ్లు తగ్గుతాయి.
స్లో గా కూలింగ్ వాటర్ ని తీసుకోండి:
స్లో గా మీరు కూలింగ్ వాటర్ తాగడం వల్ల ఎక్కిళ్ళు తగ్గుతాయి.
తేనె:
తేనె తీసుకోవడం వల్ల కూడా ఎక్కిళ్లు తగ్గేందుకు అవుతుంది. చూసారు కదా ఇంటి చిట్కాలతో ఈజీగా మనం ఎలా ఎక్కిళ్ళను తగ్గించుకోవచ్చు అనేది మరి వీటిని అనుసరించి ఆ సమస్యకు చెక్ పెట్టండి.