డయాబెటిస్ ని ఇలా కంట్రోల్ చేసుకోండి..!

-

ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే డయాబెటీస్ ని అదుపులో చేయడం చాలా కష్టం అని అనుకుంటే పొరపాటు. ఈ విధంగా అనుసరిస్తే కచ్చితంగా సమస్యను అదుపు చేయవచ్చు.

 

కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది రోగులు ఇబ్బంది పడ్డారు. ఏది ఏమైనా డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవాలి లేదు అంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ రోజు డయాబెటిస్ ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, డయాబెటిస్ సమస్య నుండి ఎలా బయట పడవచ్చు అనే విషయాన్ని చూద్దాం.

డయాబెటిస్ సమస్య ఉన్న వాళ్లకి కిడ్నీ సమస్యలు, పాదాల సమస్యలు మొదలైనవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ముందు నుండి కూడా డయాబెటిస్ పేషెంట్లు జాగ్రత్త తీసుకోవాలి.

రెగ్యులర్ చెకప్:

ఎప్పటికప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ వంటివి చేయించుకుంటూ ఉండాలి. డయాబెటిస్ వల్ల ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా లేదా అనేది కూడా డాక్టర్ ని అడిగి తెలుసుకోవాలి.

వ్యాయామం:

తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం చాలా ముఖ్యం. డయాబెటిస్ పేషెంట్లు కి మేలు చేసే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రషర్ తగ్గుతుంది. అలాగే వ్యాయామం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఒత్తిడి కి దూరంగా ఉండండి:

ఒత్తిడి కారణంగా చాలామందిలో ఇబ్బందులు ఎక్కువ అయిపోతాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. అందుకని వీలైనంత ప్రశాంతంగా ఉండండి. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ పేషెంట్లు ఇబ్బంది కలగకుండా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news