వైట్‌ డిశ్చార్జ్‌ అయ్యే మహిళలు ఉసిరిని ఇలా వాడితే వారంలో సమస్య మాయం..!!

-

చాలామంది మహిళల్లో కామన్‌గా ఉండే.. వైట్‌ డిశ్చార్జ్‌.. దీని వల్ల ఎలాంటి నొప్పులు ఉండవు కానీ..అసౌకర్యంగా ఉంటుంది. అసలు ఇది ఎందుకు అవుతుందంటే.. చాలా కారణాలు ఉన్నాయి. అయితే.. ఈ సమస్యను నివారించడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి.. అవేంటంటే..ఉసిరికాయ‌ల‌ను తిన‌డం లేదా వాటి జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి.. ఉసిరికాయ‌ల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. జ‌లుబు, ఫ్లూ వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంతోపాటు రోగ నిరోధ‌క శ‌క్తిని కూడా పెంచుతాయి.. బీపీ నియంత్ర‌ణ‌లో ఉండేందుకు, లివ‌ర్ దెబ్బ‌తిన‌కుండా ఉండేందుకు ఉసిరికాయ‌లు ఎంత‌గానో దోహ‌దం చేస్తాయి.
ఉసిరిలో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు మ‌న‌కు ఎన్నో విధాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఉసిరికాయ‌ల‌ను తిన్న త‌రువాత చాలా మంది వాటిలోని విత్త‌నాల‌ను పారేస్తారు. కానీ వాటిని పొడిగా చేసి చ‌ర్మానికి ఉప‌యోగిస్తే చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది. ఇక అధికంగా వైట్ వజైన‌ల్ డిశ్చార్జి అయ్యే మ‌హిళ‌ల‌కు ఉసిరి ఎంత‌గానో మేలు చేస్తుంది.ఉసిరి కాయ‌ల్లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది నారింజ‌ల్లో ఉండే విట‌మిన్ సి క‌న్నా 20 రెట్లు ఎక్కువ. అలాగే ఉసిరిలో వివిధ ర‌కాల ఫ్లేవ‌నాయిడ్స్ ఉంటాయి. ఇవి జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతాయి. వీటిల్లో ఉండే విట‌మిన్ బి5, బి6, కాప‌ర్‌, మాంగ‌నీస్‌, పొటాషియంలు మ‌న‌కు పోష‌ణ‌ను అందిస్తాయి.ఉసిరికాయ‌ల‌ను మ‌నం చాలా ర‌కాలుగా తీసుకోవ‌చ్చు. వాటిని నేరుగా తిన‌వ‌చ్చు. లేదా జ్యూస్ రూపంలో కూడా తాగొచ్చు.. అయితే వైట్ డిశ్చార్జి అయ్యే మ‌హిళ‌లు మాత్రం ఉసిరి విత్త‌నాల‌ను పొడి చేసి తీసుకోవాలి. దీంతో ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఉసిరి విత్త‌నాల పొడి మార్కెట్‌లో ల‌భిస్తుంది. లేదా దాన్ని నేరుగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అందులో స‌రిప‌డా తేనె లేదా బెల్లంను క‌లిపి మెత్త‌ని పేస్ట్‌లా త‌యారు చేసుకోవాలి. దీన్ని గాలి చొర‌బ‌డ‌ని సీసాలో నిల్వ చేసుకోవాలి.
Pictures and Videos of Cervical Mucus, Ovulation Discharge, Cervical Fluid.  — Groove
ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో పైన తెలిపిన మిశ్ర‌మాన్ని ఒక టేబుల్ స్పూన్ మోతాదులో క‌లిపి రోజూ ఉద‌యాన్నే తాగాలి. కొంద‌రు మ‌హిళ‌ల‌కు తెలుపు రంగులో కాకుండా ప‌సుపు లేదా గ్రీన్ క‌ల‌ర్‌లోనూ డిశ్చార్జి అవుతుంది. ఇది సాధరణమే.. భయపడాల్సిన పని లేదు. అయితే కొంద‌రికి ఈస్ట్రోజ‌న్ హార్మోన్ అస‌మ‌తుల్య‌త‌లు లేదా ఇన్‌ఫెక్ష‌న్ల కార‌ణంగా ఈ స‌మ‌స్య వ‌స్తుంటుంది. ఇన్‌ఫెక్ష‌న్ ఎక్కువ‌గా ఉంటే డిశ్చార్జి ఎక్కువ‌గా అవుతుంది. అయితే ఒక‌సారి ఈ స‌మ‌స్య త‌గ్గితే మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌చ్చేందుకు కూడా అవ‌కాశం ఉంటుంది. కానీ ఉసిరికాయ విత్త‌నాల‌ను పై విధంగా వాడుకుంటే వాపులు త‌గ్గ‌డంతోపాటు ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. దీంతో ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. పైన తెలిపిన మిశ్ర‌మాన్ని క‌నీసం ఒక వారం పాటు తీసుకుంటే చాలు మంచి ఫలితం ఉంటుంది.

మీరు వద్దు..

ఉసిరికాయ‌ల‌తో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు ఉన్నప్పటికీ.. కొందరు దీనికి దూరంగానే ఉండాలి.. రక్తాన్ని ప‌లుచ‌గా చేసే మందుల‌ను వాడేవారు లేదా శ‌స్త్ర చికిత్స అయిన వారు వాడ‌కూడదు…ఇక గ‌ర్భిణీలు, పాలిచ్చే త‌ల్లులు లేదా గ‌ర్భం దాల్చాలని చూస్తున్న మ‌హిళ‌లు కూడా ఈ మిశ్ర‌మాన్ని వాడకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news