చలికాలంలో మీ ఆరోగ్యం బాగుండాలంటే…వీటిని అనుసరించాల్సిందే…!

-

చలికాలంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. మనకి తెలియకుండా చలికాలంలో డిహైడ్రేషన్ సమస్య ఎక్కువగా వస్తుంది. చల్లగా ఉండటం వలన నీళ్లు ఎక్కువ తాగము. దీని వలన డిహైడ్రేషన్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని కచ్చితంగా నీళ్ళని ఎక్కువ తీసుకుంటూ ఉండాలి.

రోగనిరోధక శక్తి కూడా చలికాలంలో తగ్గిపోతుంది దీని మూలంగా జలుబు, దగ్గు, ఆస్తమా మొదలైన సమస్యలు కలుగుతాయి. చర్మ సమస్యలు వంటివి కూడా చలికాలంలో మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. చలికాలంలో ఎప్పటికప్పుడు హైడ్రేట్ గా ఉండడానికి చూసుకోవాలి. ఎక్కువ నీళ్లు తీసుకోవడం, పండ్లు, కూరగాయలు వంటిvi తీసుకోవడం లాంటివి చేయాలి. పండ్ల రసాలు, సూప్స్ కూడా తీసుకుంటూ ఉండొచ్చు. చాలా చలిగా ఉందని చాలా మంది ఆల్కహాల్ ని తీసుకుంటూ ఉంటారు దీనివలన నీళ్ళని ఆవిరి చేసేస్తుంది కాబట్టి తీసుకోకండి.

చలికాలంలో ఈ పండ్లను తీసుకుంటే మంచిది:

ద్రాక్ష పండ్లు:

ఇందులో 88% నీళ్లు ఉంటాయి విటమిన్ సి కూడా ఉంటుంది. ద్రాక్ష పండ్లు తీసుకోవడం వలన చలికాలంలో ఇబ్బందులు రావు.

ఆపిల్:

ఆపిల్ లో 80 నుండి 85% వరకు నీళ్లు ఉంటాయి. కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. అలానే దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇమ్యూనిటీని కూడా ఇది పెంచుతుంది ఆపిల్.

దానిమ్మ:

ఇందులో 82% నీళ్లు ఉంటాయి క్యాలరీలు 50 మాత్రమే ఉంటాయి దానిమ్మను కూడా చాలా కాలం లో తీసుకోవడం మంచిది.

నారింజ:

ఇందులో 86% నీరు ఉంటుంది చలికాలంలో నారింజన్ని తీసుకుంటే కూడా మంచిది. అలానే పైనాపిల్ ని కూడా చలి కాలంలో తీసుకోండి దీనితో ఆరోగ్యం బాగుంటుంది చలికాలంలో సమస్యలు రావు.

Read more RELATED
Recommended to you

Latest news