వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే గర్భిణీలు వీటిని ఫాలో అయితే సమస్యలు వుండవు..!

-

గర్భిణీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. హార్మోన్స్ లో ఎక్కువ మార్పులు కూడా కలుగుతూ ఉంటాయి. అలానే ప్రెగ్నెన్సీ సమయంలో 60 శాతం మంది మహిళలు నడుం నొప్పితో బాధపడుతూ ఉంటారు.

 

అందుకని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మరి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే గర్భిణీలు ఎలాంటి పద్ధతులని అనుసరించాలి. ఎలాంటి పద్ధతుల్ని అనుసరించకూడదు అనే దాని గురించి ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం చూసేయండి.

ఇలా వికారం వాంతులు కి దూరంగా ఉండండి:

గర్భిణీలకు మార్నింగ్ సిక్ నెస్ ఉంటుంది. దీనితో వికారం, వాంతులు ఎక్కువగా ఉంటాయి. నిజానికి 9 నెలలలో ఎప్పుడైనా ఈ సమస్య కలగొచ్చు. కాబట్టి వికారం, వాంతులు వంటివి కలగకుండా చూసుకోండి. అల్లం టీ తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు. తక్కువ ఫైబర్ సాఫ్ట్ గా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే వికారం ఉండదు. అలానే బాగా కారం, బాగా పులుపు వుండే ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది.

నీరసం రాకుండా చూసుకోండి:

గర్భిణీలకు ఎక్కువగా నీరసం కూడా వస్తూ ఉంటుంది. అందుకనే ఐరన్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి. ఐరన్ తక్కువగా ఉండటం వల్ల కూడా నీరసం ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు, బీన్స్, పౌల్ట్రీ, రెడ్ మీట్ వంటివి డైట్ లో తీసుకుంటూ ఉండండి. దీనివల్ల నీరసం ఉండదు. కాసేపు వర్క్ చేసుకున్నాక కాసేపు కళ్లు మూసుకుని రిలాక్స్ గా ఉంటే నీరసం తగ్గుతుంది. ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా నీరసం తగ్గుతుంది.

రాత్రి త్వరగా నిద్రపోండి:

కనీసం ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం మంచిది. అలనే కంఫర్టబుల్ గా ఉండండి. మీరు కూర్చున్నప్పుడు నిల్చునేటప్పుడు కంఫర్ట్ గా కూర్చోండి.

రెగ్యులర్ గా బ్రేక్ తీసుకుంటూ ఉండండి:

ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. అలాగే ఎక్కువసేపు నిలబడడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ జాగ్రత్తలు కూడా తీసుకోండి.

ఒత్తిడి లేకుండా చూసుకోండి:

మీరు చేసే ఉద్యోగం వలన ఒత్తిడి ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఒత్తిడి లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ధ్యానం వంటివి చేయడం వల్ల ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు ఇలా గర్భిణీలు జాగ్రత్తలు తీసుకుంటే ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version