పిల్లల్లో డయాబెటీస్ రిస్క్ ని ఇలా తగ్గించండి..!

-

ఈ కాలంలో ఎక్కువ మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. డయాబెటిస్ వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఇది కేవలం పెద్దల్లో మాత్రమే కాదు పిల్లల్లో కూడా రావడం జరుగుతోంది. అందుకనే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుని మంచి జీవన విధానాన్ని ఫాలో అయ్యేట్టు చూడాలి.

 

Reduce the risk of diabetes in children

సరైన జీవన విధానం లేకపోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ తో చిన్న పిల్లలు కూడా బాధ పడుతున్నారు. ఇన్సులిన్ హార్మోన్ కారణంగా టైప్2 డయాబెటిస్ వస్తుంది. ఒబేసిటీ మరియు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. అయితే టైప్ డయాబెటిస్ రాకుండా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఈ టిప్స్ ని ఫాలో అవ్వాలి.

ఫిజికల్ యాక్టివిటీ:

పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ చాలా ముఖ్యం లేదు అంటే వాళ్ళు ఒబేసిటీ బారిన పడి పోయే అవకాశం ఉంది. అందుకని పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ జరిగేలా తల్లిదండ్రులు చూసుకోవాలి.

మంచి జీవన విధానం:

మంచి జీవన విధానం ఉంటే టైప్ 2 డయాబెటిస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. కాబట్టి తీసుకునే ఆహారం మరియు ఫిజికల్ యాక్టివిటీని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అదే విధంగా ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. అలానే మీ డైట్ లో ఎక్కువ పండ్లు, కూరగాయలు కూడా తీసుకోవాలి. ఇది ఇలా ఉంటే ఆహారాన్ని బాగా ఎక్కువగా తీసుకోకుండా చూసుకోవాలి. అధికంగా తినడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి.

వాకింగ్, ఏదైనా ఆటలు ఆడించడం లాంటివి తల్లిదండ్రులు చేయాలి. వయసుని బట్టి కూడా ఇది వస్తుంది. ఎక్కువగా ఈ సమస్య ఎర్లీ టీన్స్ లో వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆడ పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. ఇలా ఈ విధంగా ఫాలో అవ్వడం వల్ల ఆరోగ్యంగా ఉండడానికి వీలు అవుతుంది అలానే ఇబ్బందులు కూడా ఉండవు.

Read more RELATED
Recommended to you

Latest news