డయబెటీస్‌కు ఈ ఆయుర్వేద మూలికలు పనిచేస్తాయట..!

-

మధుమేహం..ప్రతి పదిమందిలో కనీసం ఆరుగురికి ఉంటుంది. ఇండియా డయబెటిక్‌కు పుట్టినిళ్లులా మారుతుంది. అనేక కారణాలు వల్ల షుగర్‌ వ్యాధి వస్తుంది. మరి ఇది ఎలాగో వచ్చింది..కనీసం నియంత్రణలో అయినా ఉంచుకోవాలిగా..! వినే వాళ్లు ఉంటే చాలా చెప్తారు..ఇంకా డయబెటిస్‌ గురించి ఇప్పటికీ చాలామంది అపోహలు ఉన్నాయి. ఏది తినాలి, ఏది తినకూడదు ఇలా..మధుమేహం ఉన్నవాళ్లు దుంపలు తినకూడదు అంటారు..నిజానికి తినకూడంది బంగాళదుంప మాత్రమే.! షుగర్‌ ఫ్రీ అయితే వాడేసుకోవచ్చు అనుకుంటారు..అవి ఇంకా ప్రమాదం. అయితే ఆయుర్వేదం ప్రకారం కొన్ని ప్రత్యేక సుగంధ ద్రవ్యాలు, మూలికల ద్వారా షుగర్‌ లెవల్స్‌ తగ్గించుకోవచ్చట.! మరి అవేంటంటే..
తిప్ప ఆకు, తిప్ప సత్తు : రుచిలో చేదుగా ఉండే తిప్ప ఆకులు రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. దీన్ని తీసుకోవడం వల్ల చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. కాలేయ సమస్యలను నివారించడంలో కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుంది.
ఉసిరి, పసుపు : ఉసిరి, పసుపు రెండూ మధుమేహ రోగులకు బాగా హెల్ప్‌ అవుతాయి. ఉసిరి, పసుపును సమపాళ్లలో కలిపి మధుమేహ రోగులకు తినిపిస్తే షుగర్ అదుపులో ఉంటుంది.
త్రిఫల, మంజిష్ట, గోక్షుర్ : నిపుణుల అభిప్రాయం ప్రకారం.. త్రిఫల, మంజిష్ట, పల్లేరు వంటి అద్భుతమైన మూలికలు కాలేయం, మూత్రపిండాలను నిర్విషీకరణ చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. శుంఠి, పిప్పలి, మారీచ ఈ మూడింటిని కలిపితే త్రిఫల అంటారు. ఇవి మధుమేహాన్ని నిరోధించే సుగంధ ద్రవ్యాలు. అంతే కాదు ఇవి మీ జీవక్రియను కూడా పెంచుతాయట..
వేప, గుడ్మార్ : ఈ రెండూ కూడా అద్భుతమైన చేదు మూలికలు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.
అశ్వగంధ : ఇది ఒత్తిడి, అలసట నుంచి ఉపశమనం కలిగించే దివ్వమైన ఔషదం అని మనకు తెలిసిందే.. రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే మూలిక. దీన్ని తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.
వీటిని నిపుణులు సూచనలు లేకుండా తీసుకోకూడదు. మనకు ఏది ఏ ఆకు అనే అవగాహన ఉండదు. పొరపాటున ఒకటనుకోని ఇంకోటి తీసుకుంటే లేనిపోని లొల్లి. ఆయుర్వేదషాపుల్లోనే వీటిని తీసుకోవడం ఉత్తమం. ఇప్పటికే టాబ్లెట్స్‌ వాడేవారైతే.. నిపుణుల సలహా మేరకు ఎంత డోస్‌ తీసుకోవాలో తెలుసుకుని ప్రారంభించాలి. టాబ్లెట్‌. ఇంకా ఇవి రెండు ఒకటే మొత్తంలో తీసుకుంటే..షుగర్‌ లెవల్స్‌ డౌన్‌ అయ్యే ప్రమాదం ఉంది.
గమనిక: పైన పేర్కొన్న అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.. ఆరోగ్యపరమైన సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించగలరు.

Read more RELATED
Recommended to you

Latest news