ప్రతీ ఏడాది జూన్ 17వ తేదీని ప్రపంచ మూత్రపిండాల క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటారు. మూత్రపిండాలు రక్తంలో వ్యర్థాలను, నీటిని గ్రహించి మూత్రాశయం ద్వారా బయటకి పంపిస్తాయి. అదీగాక రక్తం పీహెచ్ స్థాయిలను మెయింటైన్ చేయడంలో, విటమిన్ డి జీవక్రియలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అందుకే కిడ్నీల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచ మూత్రపిండాల క్యాన్సర్ డే గా జరుపుకుంటారు.
ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్లలో కిడ్నీ క్యాన్సర్ 13వ స్థానంలో ఉంది.. ఎక్కువ మందిలో కనిపించే కిడ్మ్నీ క్యాన్సర్లలో రీనల్ సెల్స్ కార్సినోమా ఒకటి. ఏటా 1,80,000 మంది ఈ కిడ్నీ క్యాన్సర్ కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. బాగా చిన్నపిల్లల్లో విలిమ్స్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ కిడ్నీ క్యాన్సర్ ఎప్పుడు వస్తుంది?
మూత్రపిండాల్లో కణితిలాగా ఏర్పడినపుడు ఈ క్యాన్సర్ వస్తుంది. ఈ కణితిలను తొందరగా గుర్తించకపోతే చాలా వేగంగా ఇతర అవయవాలకు విస్తరించే అవకాశం ఉంటుంది. తాజా అధ్యయనాల ప్రకారం ఈ క్యాన్సర్లు పెరుగుతున్నాయి. సీటీ క్యాన్సర్లలో అనుకోకుండా ఇవి బయటపడుతున్నాయి. మొదటి దశలో ఉన్నప్పుడే చికిత్స జరిపితే నయం అయ్యే అవకాశం ఉంటుంది.
లక్షణాలు
మొదట్లో ఈ క్యాన్సర్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అదీగాక బయట నుండి కనుక్కోలేం కూడా. సమయం గడుస్తున్న లక్షణాలు బయటపడతాయి. అందులో మూత్రం రంగు మారిపోవడం, గులాబీ, నలుపు, ఆకుపచ్చ రంగులో మూత్ర విసర్జన జరగడం లక్షణంగా ఉంటుంది. ఇంకా నడుము నొప్పి, అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం, నిరంతరం జ్వరం, తీవ్రమైన అలసట కనిపిస్తుంది.
కిడ్నీ క్యాన్సర్ కి కారణాలు
వైద్యులు కూడా సరైన కారణాన్ని ఇంతవరకు కనుక్కోలేకపోయారు. కాకపోతే పొగతాగేవారిలో కిడ్నీ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. హైబీపీ ఉన్న వారు కూడా ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువ.
వైద్యం
ఈ క్యాన్సర్ కి సర్జరీ చేస్తారు. మొదటి దశలోనే కనిపెట్టగలిగితే బాగుంటుంది. అలా కాకుండా ఇతర అవయవాలకు పాకితే మాత్రం ఇతర చికిత్సలు కూడా చేయాల్సి ఉంటుంది.
స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్ అంటే ఏమిటి ? లక్షణాలు ఎలా ఉంటాయి ? కోలుకోవచ్చా ?