ఇలాంటి కేకులు నెవ్వర్ బిఫొర్..ఎవ్వర్ ఆఫ్టర్..

-

కేక్.. ఈ పేరు వినగానే అందరికి నోరూ ఊరిపోతుంది..చూడగానే తినాలనిపించే విధంగా అందరినీ ఆకట్టుకుంటాయి.అందుకే చిన్న వాళ్ళ దగ్గరి నుంచి పెద్ద వాళ్ళ వరకూ అందరూ కేకులు చూడగానే ఆగలేరు..అయితే ఫంక్షన్, పార్టీ, పండుగ ఇలా ఏది వచ్చినా కేకు ఉండాల్సిందె..కాగా, ఈ మధ్య జనాలను ఆకర్షించడానికి కొత్త రుచులతో, కొత్త హంగులతో రకరకాల కేకు లను బేకరీ నిర్వాహకులు తయారు చేస్తున్నారు..వాటికి డిమాండ్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది..అందుకే మార్కెట్ లో వీటికి ప్రత్యేక స్థానం ఉంది.

కేకులను తయారు చేయాలంటే కేవలం స్కిల్స్ ఉంటే చాలు అని అంటారు..కానీ అలా అవసరం లేదు..చేయాలనే ఆసక్తి ఉంటే ఎవరైనా ఈజిగా చేయవచ్చు..అలా మొదట చిన్నగా మొదలు పెట్టి ఇప్పుడు బిజినెస్ గా మార్చుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు.. తాజాగా ఈ జాబితాలోకి ఓ మహిళ చేరింది.తాను చేస్తున్న ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసింది.. అంతేకాదు తన అభిరుచినే వ్యాపారంగా మార్చుకుంది. తాను ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ లతో వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకర్షిస్తోంది..

అమెరికాలో నివాసం ఉంటున్న 29 ఏళ్ల మరియన్ సర్కిసియన్. ఆమె డిజైన్ చేస్తోన్న కేక్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి..ఆమెకు కేకులను తయారు చేయడంపై ఉన్న ఆసక్తి ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెడుతుంది అని ఆమె చాలా సందర్భాలలొ చెప్పింది కూడా.. ఇప్పుడు అనే బిజినెస్ మూడు పువ్వులు, ఆరు కాయలు అయ్యింది.. ఆమె బిజినెస్ పెరగడంతో కొందరికి పనిని కూడా కల్పిస్తుంది.. నిజంగా ఇలాంటి ఆలొచలన రావడం గ్రేట్..అందుకు చాలా దైర్యం కావాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version