స్ఫూర్తి: బ్యాంక్ జాబ్ ని వదిలేసి మరీ వ్యవసాయం.. ఏటా 21 కోట్లు..!

-

అనుకున్నది సాధించడం అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరికి కొన్ని కలలు ఉంటాయి వాటిని నిజం చేసుకోవాలని ఎంతో ట్రై చేస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రమే లైఫ్ లో సక్సెస్ ని అందుకుంటారు. లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే అందుకోసం మనం ఎంతగానో కష్టపడాలి. కొంతమంది ఉద్యోగాన్ని కూడా వదిలేసుకుని వ్యాపారంపై దృష్టి పెడుతుంటారు. కొంతమంది వ్యవసాయం చేస్తూ ఉంటారు ఈ వ్యక్తి బ్యాంకు జాబు ని వదిలేసుకుని ఏకంగా ఇప్పుడు ప్రతి సంవత్సరం 21 కోట్ల రూపాయలని సంపాదిస్తున్నారు.

 

ఇక వివరాల్లోకి వెళితే రసాయనాక వ్యవసాయం వలన కలిగే నష్టాలను గ్రహించి కిషన్ మరియు అతని సోదరుడు సేంద్రియ వ్యవసాయం చేయాలని అనుకున్నారు. సేంద్రియ వ్యవసాయం పాడి వ్యవసాయం ద్వారా సంవత్సరానికి 21 కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు. బెంగళూరులోని అనేక బ్యాంకులో ఎనిమిది సంవత్సరాలు పాటు పనిచేశారు కార్పొరేట్ ఉద్యోగం వదిలేసి తాత చేసిన వ్యవసాయాన్ని కిషన్ మొదలుపెట్టాడు. అతని సోదరుడు కూడా వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. అరటితో సహా ఇతర పంటలను కూడా పండించడం మొదలుపెట్టారు.

నాలుగేళ్ల పాటు జీరో బడ్జెట్ వ్యవసాయం చేశారు ఈ సోదరులు. ఆవు పేడని ఎరువుగా వీళ్ళు వాడతారు రసాయనాలను ఉపయోగించి పండించే పంటల వలన కెమికల్స్ ఉండడంతో ఇబ్బంది పడాలని ఇన్ఫెక్షన్లు వంటివి వచ్చే అవకాశాలు ఉంటాయని అలా కాకుండా సేంద్రియ వ్యవసాయం చేస్తే మంచిదని వీళ్ళు అనుకున్నారు. బెంగళూరు వంటి పెద్ద నగరాలకి వీళ్ళ యొక్క పంటని సరఫరా చేస్తూ ఉంటారు.

వేరుశనగ, కొబ్బరి. పచ్చిబఠానీలు, పాల ఉత్పత్తులు, కూరగాయలు ఇలా ఏకంగా 40 రకాల ఆహార పదార్థాలని వీళ్ళు పండిస్తున్నారు. ఒక వెబ్సైట్ ద్వారా వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ని విక్రయిస్తున్నారు బెంగళూరులో వీళ్ళకి స్టోర్ కూడా ఉంది లక్షల మంది కస్టమర్లను హ్యాండిల్ చేస్తూ ఉంటారు ఇలా బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసుకుని ఇప్పుడు సంవత్సరానికి ఏకంగా 21 కోట్ల రూపాయలని సంపాదిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version