అమ్మాయిలు మీ హైట్‌ 5.4 అయితే వెయిస్ట్‌ ఎంతుండాలో తెలుసా..?

-

అమ్మాయిలకు నడుము సన్నగా ఉండాలని తెగ ఇష్టపడతారు.. నిజానికి నడుము మంచి షేప్‌లో ఉంటేనే ఏ డ్రస్‌ అయినా కరెక్ట్‌గా ఫిట్‌ అవుతుంది. అప్పుడే లుక్‌ అదిరిపోతుంది. నడుము అంటే హీరోయిన్స్‌కు ఉన్నట్లే ఉండాలి అనుకుంటారు చాలా మంది అమ్మాయిలు. కానీ నడుము అంటే సన్నగా ఉండటం కాదు.. మీ హైట్‌ను బట్టి మీ నడుము చుట్టు కొలతను డిసైడ్‌ అవ్వాలి. దీనికి ఓ లెక్క ఉంది. మరి ఆ లెక్కను బట్టి.. అమ్మాయిలు మీ హైట్‌ను బట్టి మీ వెయిస్ట్‌ ఎంత ఉండాలో తెలుసుకోండి.!
5 అడుగుల 1 అంగుళం ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 24 ఇంచులు ఉండాలి. 28 ఇంచుల‌కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 31కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు.
5 అడుగుల 2 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 24.5 ఇంచులు ఉండాలి. 29కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 32కి పైన ఉంటే స్థూల‌కాయంతో ఉన్నట్లు.
5 అడుగుల 3 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 25 ఇంచులు ఉండాలి. 30కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 33కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.
5 అడుగుల 4 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 26 ఇంచులు ఉండాలి. 30కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 33కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.
5 అడుగుల 5 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 26 ఇంచులు ఉండాలి. 31కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 34కి పైన ఉంటే స్థూల‌కాయమే.
5 అడుగుల 6 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 26 ఇంచులు ఉండాలి. 32కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 35కి పైన ఉంటే స్థూల‌కాయం.
5 అడుగుల 7 అంగుళాల నుంచి 5 అడుగుల 9 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 27 ఇంచులు ఉండాలి. 33కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు. అదే 36కి పైన ఉంటే స్థూల‌కాయం.
5 అడుగుల 10 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 27.5 ఇంచులు ఉండాలి. 35కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 38కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు.
6 అడుగులు అంత‌కన్నా ఎక్కువ‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 28 ఇంచులు ఉండాలి. 37కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే కొల‌త 40కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.
ఈ విధంగా ఎత్తుకు త‌గిన విధంగా న‌డుం చుట్టుకొల‌త ఉండేలా చూసుకోవాలి. దీంతో గుండె జ‌బ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news