Meta AI stickers for Independence Day 2024: మీ స్నేహితులకు ఇలా విషెస్ ని తెలపండి..!

-

భారతదేశంలోని ప్రజలంతా ఈరోజు 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌స్ లో దేశభక్తి పోస్టులుతో, సందేశాలతో నిండి ఉన్నాయి. మీరు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను ఫార్వర్డ్ చెయ్యాలా..? ముందుగా తయారు చేసిన స్టిక్కర్‌లను షేర్ చేయవచ్చు. AI రూపొందించిన చిత్రాలు, స్టిక్కర్‌లు అందరికీ నచ్చుతాయి. మీరు ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాస్త ప్రత్యేకమైన స్టిక్కర్‌లు, చిత్రాలను రూపొందించడానికి చూస్తున్నట్లయితే, వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ లో మెటా AI ని ఉపయోగించవచ్చు. ఇక మరి ఎలా చేయాలో ఇక్కడ చూసేద్దాం.

Meta AIని ఉపయోగించి స్వాతంత్ర్య దినోత్సవ చిత్రాలు, స్టిక్కర్‌లను ఎలా రూపొందించాలి..?

దీనికోసం ముందు మీ ఫోన్‌లో వాట్సాప్ తెరిచి, మెటా AIని చెప్పే టాప్ సెర్చ్ బార్‌పై నొక్కండి. లేదంటే చాట్‌ని తెరవండి.
టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్‌లను రూపొందించడానికి ప్రయత్నించవచ్చు. మెటా AIతో సహా చాలా AI చాట్‌బాట్‌లు తప్పులను కూడా సరి చేస్తాయి. కాబట్టి ఏదైనా టెక్స్ట్ మెసేజ్లను చేర్చమని అడగొచ్చు.

ఇలాంటివి కూడా మీరు అడగొచ్చు:

మెటా AI ప్రాంప్ట్:

Generate an image of a group of bikers with an Indian flag.
Generate a sticker that shows a kid waiving an Indian flag.
Show an Indian flag waving at the top of a flag post. ఇలా మీరు మెటా సహాయంతో సూపర్ పిక్స్ ని తయారు చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version