ప్రేమకు వయస్సెందుకు..వీరికి ఓ వేసుకోండి..

-

ప్రేమకు వయస్సు తో పనిలేదు..ఎప్పుడూ ఎవరి మనసులో పుడుతుందో చెప్పడం కాస్త కష్టమనే చెప్పాలి..ప్రేమకు వయసు, ప్రాంతం, కులం, మతం.. ఇలా ఎలాంటి తారతమ్యాలు ఉండవు. దీనికి తగ్గట్లే నేటి యువత ప్రేమకున్న నిర్వచనాన్ని పూర్తిగా మార్చేసింది.అందుకే ఈ రోజుల్లో వినూత్నమైన ప్రేమకథలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా అలాంటి మరో వెరైటీ ప్రేమకథే వెలుగులోకి వచ్చింది. దీని గురించి తెలుసుకుని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ప్రేమలో పడ్డాక ప్రపంచాన్నే మర్చిపోతారంటారు.

ఈ ప్రేమకథలో కూడా అంతే. బిహార్‌ లోని సమస్తిపూర్‌లో నివాసముంటోన్న ఓ 42 ఏళ్ల ఉపాధ్యాయుడు స్టూడెంట్‌నే పెళ్లాడాడు. ఆమె వయసు కేవలం 24 ఏళ్లు మాత్రమే. అంటే వీరిద్దరి వయసు లో 22 ఏళ్ల గ్యాప్‌ ఉంది. అయినా వారికి ఇది కనిపించలేదు. ఈ వినూత్నమైన ప్రేమకథకు కోచింగ్‌ సెంటర్‌లో పునాది పడింది. ఉపాధ్యాయుడు నిర్వహిస్తోన్న ఈ కోచింగ్‌ సెంటర్‌ లో ఇంగ్లిష్‌ నేర్చుకోవడానికి వచ్చింది స్టూడెంట్‌…

అయితే ఆ మాస్టర్ ఎలాంటి పాఠాలు తమ ప్రేమబంధాన్ని మరింత బలంగా మార్చుకోవాలనుకున్న వీరిద్దరు తాజాగా గుడిలో వివాహం చేసుకున్నారు. చుట్టుపక్కల వారు, కోచింగ్‌ సెంటర్‌లో చదువుకుంటోన్న విద్యార్థులు కూడా వీరి వివాహానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే గురువుగారి మొదటి భార్య చాలా ఏళ్ల క్రితమే మరణించింది. అయితే అతను మాత్రం రెండవ పెళ్లి చేసుకోవడంపై ఆసక్తి చూపలేదు. అయితే ఎప్పుడైతే ఈ విద్యార్థిని కోచింగ్ సెంటర్‌లోకి అడుగుపెట్టిందో ఆమెపై ప్రేమ మొదలైంది. ఆమెతో తన జీవితాన్ని పంచుకోవాలనుకున్నాడు.. ఆ అమ్మాయి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరు ఒకటయ్యారు.. నిజంగా వీరి ప్రేమకు ఓ వేసుకోవాల్సిందే..

Read more RELATED
Recommended to you

Latest news