వామ్మో.. ఆ బామ్మకు 42 అడుగుల పొడవైన గోళ్లు..ఎందుకు పెంచిందంటే..

జనరల్‌గా లేడీస్‌కు గోళ్లు పెంచుకోవడం అంటే ఇష్టం ఉంటుంది. స్లైల్‌ తప్ప దాని వెనుక పెద్దగా కారణాలు కూడా ఉండవు. ఈ మధ్య కొందరు బాయ్స్‌ కూడా చిటికినవేలు గోరును పొడవుగా పెంచేసుకుంటున్నారు. ఫ్యాషన్‌ ప్రపంచంలో ఇవన్నీ ఓ భాగం.. అయితే గోళ్లు పెంచడం వెనుక ఒక ఎమోషన్‌ దాగి ఉంటే..ఆ ఎమోషన్‌ కారణంగా ఆ గోళ్లు ప్రపంచంలోనే పొడవైన గోళ్లుగా రికార్డు సృష్టిస్తే.. రెండు చేతులకు కలిపి 42 అడుగుల గోళ్లు పెంచి ఆమె గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించింది.
పొడవైన గోళ్లు… రెండు చేతులకున్నా గోళ్లను కలిపితే 42 అడుగులు ఉన్నాయిట. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. పీత కాళ్లలా పొడవుగా కనిపిస్తున్న ఈ గోళ్లను చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది.
ఆమె పేరు డయానా. అమెరికాలో నివసిస్తోంది. గత పాతకేళ్లుగా ఆమె గోళ్లు కత్తిరించుకోలేదట. ఇకపై కూడా కత్తిరించుకోనని చెప్పేస్తోంది. గోళ్లు పెంచింది ఏవో రికార్డులు వస్తాయని కాదు.. తాను గోళ్లు పెంచడం వెనుక చాలా బాధకరమైన గతం ఉందని వివరించింది. తన ముద్దుల కూతురి జ్ఞాపకంగా ఈ గోళ్లను పెంచుకుంటున్నట్టు చెబుతోంది డయానా. పాతికేళ్ల క్రితం 16 ఏళ్లే తన కూతురు ఓ రోజు రాత్రి తన గోళ్లకు నెయిల్ పాలిష్ పెట్టి, తరువాత వెళ్లి తన గదిలో నిద్రపోయిందట.. ఉదయం ఎంతకీ లేవలేదని, చూస్తే మరణించి ఉందని వివరించింది. నిద్రలోనే ఆమెకు ఆస్తమా తీవ్రంగా ఎటాక్ చేయడం వల్ల ఊపిరి ఆడక చనిపోయినట్టు తెలిపింది. ముందు రోజు రాత్రే ఆమె తనకు గోళ్లకు నెయిల్ పాలిష్ పెట్టిందని, ఆ గోళ్లను కత్తిరించకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. గోళ్లు పెరుగుతున్న కొద్దీ తన కూతురు తనతోనే ఉన్నట్టు అనిపిస్తున్నట్లు డయానా తెలిపింది.
డయానా ఇప్పటికీ తన గోళ్లకు నెయిల్ పాలిష్ పెట్టించుకుంటుంది. ఆ గోళ్లకు నెయిల్ పాలిస్ పెట్టాలంటే అయిదారు గంటలు పడుతుందట.. తన మనవల్లే చాలా ఓపికగా పెడతారని డయానా తెలిపింది. కనీసం ఇరవై నుంచి ముప్పై నెయిల్ పాలిష్ డబ్బాలు అవసరం పడతాయట. ఏది ఏమైనా ఆమె ఇలా గోళ్లు పెంచుకోవడం వల్ల తీవ్ర ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వస్తుంది. మనతో ఉండేవే జ్ఞాపకాలు కాదు..మనసులో ఉండేవి కూడా జ్ఞాపకాలే..కానీ ఆమె నిర్ణయం అది.. ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదనుకోండి..!