టెస్టులకు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ ఎవరు..? అన్నది ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్లో హాట్ టాపిక్‌గా మారింది. టెస్టులలో ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేయడానికి గాను మార్కస్ హరిస్, కామెరూన్ బాన్‌క్రాఫ్ట్,కామెరూన్ గ్రీన్ల పేర్లు వినపడుతున్నాయి. తాజాగా స్టార్ బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ కూడా.. అవకాశమొస్తే నేనూ ఓపెనర్ గా వస్తా అనడంతో చర్చ మరింత రసవత్తరంగా సాగుతోంది. స్మిత్ వ్యాఖ్య లకు ఆస్ట్రేలియా మాజీ సారథి మైకేల్ క్లార్క్ స్పందిస్తూ.. వార్నర్ ఓపెనింగ్ స్థానాన్ని భర్తీ చేయడానికి స్మిత్ సరైనోడని అభిప్రాయపడ్డాడు. ఒక వేళ స్మిత్ గనక ఓపెనర్ గా వస్తే విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా టెస్టులలో చేసిన 400 పరగుల రికార్డును కూడా బ్రేక్ చేస్తాడని మైకేల్ క్లార్క్ ధీమా వ్యక్తం చేశాడు.
ఈఎస్పీఎన్ పోడ్కాస్ట్లో మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ… ‘ఒకవేళ స్టీవ్ స్మిత్ గనక ఓపెనింగ్‌కు వస్తానంటే ఆసీస్ టీమ్ మేనేజ్మెంట్ అందుకు అంగీకారం తెలపాలి. స్మిత్‌ను వద్దనుకుంటే వార్నర్ స్థానంలో కామెరూన్ గ్రీన్‌ను పంపాలి. కానీ స్మిత్ అందుకు ఒప్పుకుంటే కామెరూన్ గ్రీన్‌ను నాలుగు లేదా ఆరో స్థానంలో ఆడించాలి.