ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల!

-

ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేయడంతో ఆ స్థానంలో వైఎస్‌ షర్మిలను నియమించే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకటి, రెండు రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఆమెను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.పీసీసీ అధ్యక్ష పదవిపై వైఎస్‌ షర్మిలకు మల్లికార్జున ఖర్గే స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకే పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో షర్మిలకు లైన్‌ క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను రేస్‌లోకి తీసుక రావడంలో భాగంగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలను షర్మిలకు అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాల్ని రచిస్తుంది.ఇటీవలే వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఏపీ కాంగ్రెస్‌ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడంతోనే షర్మిల పార్టీ కండువా కప్పుకుందని ప్రచారం సాగింది. ప్రస్తుతం షర్మిల తన కుమారుడి వివాహము ఫిబ్రవరిలో ఉండడంతో వివిధ రాజకీయ, సిని ప్రముఖులను ఆహ్వానిస్తు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version