రానున్న 24 గంటల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు…

-

నిన్నటి వరకు దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇవాళ మధ్య ట్రోపోస్ఫియరిక్ స్థాయి వరకు విస్తరించిందని తెలిపింది. ఈ ఆవర్తనం నైరుతి దిశగా వంగి ఉండడం వల్ల, దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దిశగా పయనిస్తుందని, ఈ నెల 16 నాటికి వాయుగుండగా మారే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి కేంద్రం వివరించింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నాయని ఐఎండీ అమరావతి కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపై అధికంగా ఉంటుందని, ఈ నెల 14, 15 తేదీల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version