తెలుగు అకాడమీ కేసులో 10 మంది అరెస్ట్..

-

తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తీగ లాగితే డొంక కదిలినట్లు… ఈ తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో ఇప్పటి వరకు ఏకంగా పది మంది అరెస్టు అయ్యారు. నిన్నటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 4 గా ఉండగా ఈరోజు 10 కి చేరింది. ఫిక్స్డ్ డిపాజిట్లలో నిధులు కొల్లగొట్టిన… మూడు బ్యాంకుల నుంచి ఏకంగా 64 కోట్లు డ్రా చేశారు.

ఈ ఏడాది సంక్రాంతి నుంచి సెప్టెంబర్ వరకు ఈ డబ్బును డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు డిసెంబర్ నెల కల్లా అకాడమీ కి చెందిన 324 కోట్ల రూపాయలు కొట్టేయాలని స్కెచ్ వేశారు. ఇక ఈ కేసులో పదిమంది నిందితులు వివరాలు ఇలా ఉన్నాయి.

A1 గా మస్తాన్ వలి (యూనియన్ బ్యాంక్ మేనేజర్), A2 గా రాజ్ కుమార్ (ఏజెంట్) లపై కేసు నమోదు చేయగా.. A3 గా సత్యనారాయణ రాజు (AP మెర్కంటైల్ బ్యాంక్) A4 గా పద్మావతి (AP మార్కంటిల్) లపై కేసు నమోదు అయింది. A5 గా మోహియుద్దీన్ (AP మార్కంటిల్), ఎ 6 గా చుందురి వెంకట సాయి (ఏజెంట్) లపై కేసు నమోదు గా.. A7 గా నందురి వెంకట (ఏజెంట్), A8 లపై వెంకటేశ్వర్ రావు (ఏజెంట్) లపై కేసు నమోదు అయింది. A9. రమేష్ (తెలుగు అకాడమీ అకౌంటెంట్) గా A10 గా సదన కెనరా బ్యాంక్ మేనేజర్ పై కేసు నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version