మహారాష్ట్రలో దారుణం.. 14ఏళ్ల బాలికపై 29 మంది రేప్ !

-

ఇండియా లో రోజు రోజు కు మహిళల పై లైంగిక దాడులు పెరిగి పోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వచ్చినా… మహిళ లపై లైంగిక దాడులు ఆగడం లేదు. అసలు ఇండియా లో మహిళలకు భద్రత ఉందా ? అనే ప్రశ్న తలెత్తక మానదు. మహిళలపై మానవ మృగాల వలె.. అత్యా చారాలకు పాల్పడుతున్నారు కొందరు దుర్మార్గులు. ఇక మొన్న హైదరాబాద్ లో ఎనిమి దేళ్ల బాలిక పై దాడి… మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

మహారాష్ట్ర రాష్ట్రంలోని థానే పట్టణం లో దారుణం చోటు చేసుకుంది. కొంత మంది నీచులు 14 సంవత్సరాల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ 14 ఏళ్ల బాలికపై ఏకంగా 29 మంది యువకులు అత్యాచారo చేశారు. అంతే కాదు బాలికను అసభ్యకరంగా వీడియోలు తీసి మరీ రేప్ చేశారు ఆ 29 మంది యువకులు.

ఆ 14 సంవత్సరాల బాలిక ఎంత ప్రాధేయపడినా… ఆమె ను విడిచిపెట్టలేదు ఆ దుర్మార్గులు. ఆ న్యూడ్ వీడియో లను అడ్డం పెట్టుకొని బాలికను బెదిరించారు ఆ యువకులు. ఇక ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు… స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు బాలికపై అత్యాచారానికి పాల్పడిన 26 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. మరో ముగ్గురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఆఅ బాలిక ఆస్పత్రిలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version