RCB ఫ్యాన్స్ కు AB డివిలీయర్స్ బిగ్ షాక్

-

AB de Villiers : RCB ఫ్యాన్స్ కు AB డివిలీయర్స్ బిగ్ షాక్ ఇచ్చాడు. తన కంటి సర్జరీ జరిగిందని, రెటీనా డిటాచ్మెంట్ కారణంగా సర్జరీ తప్పలేదని, ఇక ఎంత మాత్రం క్రికెట్ ఆడలేనని తెలిపాడు. సోమవారం సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించిన డివిలియర్స్, తన గురించి తనకు జరిగిన శాస్త్ర చికిత్స గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశాడు.


ఏబి డివిలియర్స్ 2018 మే లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో సహా పలు టి20 లీగ్ లలో అతను ఆడారు.

కానీ 2021 నవంబర్ లో అన్ని రకాల క్రికెట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అతను ఐపిఎల్ 2022 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడలేదు. అభిమానులు మాత్రం తన రిటైర్మెంట్ విషయమై మరోసారి పునరలోచించి మళ్లీ క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్ లోకి అడుగు పెట్టాలని కోరుకున్నారు. కానీ తాను ఇక ఎంత మాత్రం మల్లి క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్లోకి అడుగుపెట్టే ప్లాన్స్ లేవని సోమవారం స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version