.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ‘రైటర్స్ బ్లాక్’ అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా సంగీత దర్శకుడిగా తన కెరీర్ మొదలు పెట్టనున్నాడు. పుణేలో తన తల్లి అయిన రేణూ దేశాయ్ దగ్గర పెరిగిన అకీరా నందన్ చిన్నపటినుండే సంగీతంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. పియానోలో అకీరా నందన్ మంచి నేర్పు ఉందని చెప్పుకోవొచ్చు. ఈ నేపధ్యం లో, తన కుమారుడు అకీరా నందన్ తనకు ఇష్టమైన రంగంలోకి ప్రవేశించడం పట్ల రేణూ దేశాయ్ పుత్రోత్సాహంతో ఉప్పొంగుతున్నారు. తన కుమారుడు సంగీత దర్శకుడిగా కెరీర్ మొదలుపెడుతున్న శుభవేళ తల్లిగా తన ఆశీస్సులు అకీరా కు అందజేశారు రేణు దేశాయ్.
“సూర్యకాంతిలోనూ మెరిసే వెలుగు చుక్కలా తనకంటూ ప్రత్యేక మార్గాన్ని ఎంచుకోవడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. నా చిన్ని తండ్రికి నా దీవెనలు. సంగీతంపై నీ ప్రేమ ఈ ప్రయాణంలో నీకు ఎంతో ఆనందాన్ని, శాంతిని, బలాన్ని కలుగజేయాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ రేణూ దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అంతేకాదు, రైటర్స్ బ్లాక్ షార్ట్ ఫిల్మ్ టైటిల్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ అకీరా నందన్ అనే కార్డ్ ను కూడా ఆమె ఓ వీడియో రూపంలో విడుదల చేశారు.