సోషల్ మీడియాలో ట్రిపుల్ ఆర్ పోస్ట్ లు తొలగింపుపై అలియా భట్ క్లారిటీ…

-

ట్రిపుల్ ఆర్ సూపర్ డూపర్ హిట్ అయింది. మూవీ యూనిట్ మొత్తం కూడ తెగ ఖుషీ అవుతోంది. ఇదిలా ఉంటే మరో వార్త కూడా చక్కర్లు కొడుతోంది. హీరోయిన్ అలియా భట్ తో ట్రిపుల్ ఆర్ టీంకు చెడిందనే వార్తలు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. ట్రిపుల్ ఆర్ సినిమాలో తనకు తక్కువ స్క్రీన్ ప్రజెన్స్ ఇచ్చారనే విషయంపై అలియాభట్ కోపంగా ఉందనే వార్తలు వచ్చాయి. గత కొన్ని రోజులుగా అలియా భట్ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ నుంచి ట్రిపుల్ ఆర్ కు సంబంధిచిన ఫోటోలను తొలిగంచిదని.. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిని అన్ ఫాలో చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ వివాదంపై అలియా భట్ క్లారిటీ ఇచ్చింది. ఇవన్నీ పుకార్లే అని ఖండించింది. గురువారం సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది. ‘‘ట్రిపుల్ ఆర్ టీంలో కలత చెంది పోస్ట్ లు తొలగించానని నేను విన్నాను. ఇన్ స్టా గ్రామ్ లో నేను ఎప్పుడూ పాత వీడియో పోస్ట్ లను మారుస్తా అని… నా ప్రొఫైల్ ను చిందరవందరగా కనిపించకుండా జాగ్రత్త పడతా’’ అని రాసుకొచ్చింది. అదే విధంగా ట్రిపుల్ ఆర్ లో సీత పాత్ర ఇచ్చినందుకు ఎస్ఎస్ రాజమౌళికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది. తారక్, చరణ్ తో నటించడం ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version