టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ప్రముఖ హాస్య దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈవివి సత్యనారాయణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి హాస్య డైరెక్టర్ గా చలామణి అయ్యారు. ఇకపోతే ఇవివి సత్యనారాయణ వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఆర్యన్ రాజేష్ ఎక్కువ కాలం నిలదొక్కుకోపోలేకపోయారు. ఇకపోతే ఆర్యన్ రాజేష్ హీరోగా కెరియర్లో ఫెయిల్ అవ్వడానికి కారణాలు కూడా చాలానే ఉన్నాయి. ఇకపోతే తన తండ్రి ఈ వీ వీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన హాయ్ అనే చిత్రం ద్వారా హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు ఆర్యన్ రాజేష్. ఇక ఈ సినిమాతో ప్రేక్షకులను బాగా అలరించాడు ఇక ఈ సినిమాని సురేష్ బ్యానర్ పై నిర్మించారు.
అంత పెద్ద బ్యానర్ లో ఈ సినిమా నిర్మించినప్పటికీ సక్సెస్ అవ్వలేదు. ఇక ఈ సినిమా తర్వాత ఒక పది సినిమాలు చేసిన ఆర్యన్ రాజేష్ కి మాత్రం ఒక్క సక్సెస్ కూడా పడకపోవడం గమనార్హం. మంచి రూపం ఉండి కూడా అదృష్టం లేకపోతే ఎలా ఉంటుందో ఆర్యన్ రాజేష్ ను చూస్తే అర్థమవుతుంది. నిజానికి ఈయన చాలా అందంగా కనిపించడమే కాకుండా మంచి యాక్టింగ్ కూడా చేస్తాడు కానీ అదృష్టం కలిసి రాక ఈయన సినిమాలన్నీ డిజాస్టర్ గా మిగిలాయి.ఈయన నటించిన ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అవడంతో మెల్లమెల్లగా సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన ను తన తండ్రి ఇవీవీ సత్యనారాయణ ఆర్యన్ రాజేష్ ను ఒక మంచి హీరోగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
సొంత బ్యానర్ పై ఎన్నో సినిమాలు చేసినా ఏ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. ఇక మరొకవైపు నరేష్ కామెడీ హీరోగా బాగానే సక్సెస్ అయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే అదృష్టం లేక ఆర్యన్ రాజేష్ హీరోగా ఎదగలేకపోయాడు అని ప్రతి ఒక్కరూ చెబుతూ ఉంటారు. అల్లరి నరేష్ మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతున్నాడు.