ఏపీ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్ద పీట వేసేలా ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. కొత్తజిల్లాల ఏర్పాటు కు ఏ క్షణమైనా నోటిఫికేషన్ వస్తుందని ఆయన అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కసరత్తు పూర్తయిందని అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రక ఘట్టం అని ఆయన అన్నారు. ఎన్నికల ముందు హమీ ఇచ్చిన విధంగానే వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని సజ్జలు తెలిపారు. పార్లమెంట్ కేంద్రాలను ఆధారంగా చేసుకుని జిల్లాల విభజన చేసినట్లు వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు ఉండబోతుందని…ప్రజా ప్రయోజనాల అనుగుణంగా మనో భావాలు దెబ్బతినకుండా జిల్లాలు ఏర్పాటు చేసాం అని ఆయన అన్నారు. చిన్న చిన్న మార్పులతోనే తుది నోటిఫికేషన్ వెలువడనుందని వెల్లడించారు. జిల్లాల ఏర్పాటులో పౌర సంఘాల సలహాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని.. 90శాతం ప్రభుత్వ భవనాల్లోనే కొత్త జిల్లాల కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు. కొత్త జిల్లాల్లో అడ్మినిస్ట్రేషన్, పొలీస్ అడ్మినిస్ట్రేషన్ ఒకే చోటా ఉండేలా నిర్ణయం తీసుకున్నామని… కొత్తగా నిర్మించే శాశ్వత భవనాలు 15 ఎకరాల్లో ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటైన తరువాత వైసీపీ శ్రేణులను మోటివేట్ చేసి సెలబ్రేషన్స్ చేస్తామని అన్నారు. 2023 నాటికి మొత్తం కొత్త జిల్లాల శాశ్వత భవనాలు పూర్తవుతాయని సజ్జల అన్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏ క్షణమైనా నోటిఫికేషన్: సజ్జల
-