ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు..బిగ్ అలర్ట్. ఏపీలో ఇవాళ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అయితే కొన్ని జిల్లాలకు మాత్రమే ఈ సెలవు వర్తించనుంది. ముఖ్యంగా ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా..ఏపీలో విపరీతంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ తుఫాను నేపథ్యంలో… కొన్ని జిల్లాలో వరదలు కూడా చోటుచేసుకుంటున్నాయి. బయటకు రాని పరిస్థితి ఉంది.
తీవ్రమైన పంట నష్టం కూడా జరిగింది. ముఖ్యంగా నెల్లూరు చిత్తూరు వైయస్సార్ కడప జిల్లాలో కుండపోత వర్షాలు పడుతున్నాయి.ఇలాంటి నేపథ్యంలో… చిత్తూరు జిల్లాలోని.. అన్ని విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ఉండనున్నట్లు కలెక్టర్ సమిత్ కుమార్ ప్రకటన చేయడం జరిగింది. అన్నమయ్య జిల్లాలోనూ అదే పరిస్థితి నెలకొంది. అటు నెల్లూరు వైయస్సార్ జిల్లాలో కూడా… విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరి కాసేపట్లోనే ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.