ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మరోసారి సత్తా చాటింది వైఎస్ జగన్ ప్రభుత్వం. బిజినెస్ రిఫార్మ్స్ ఏక్షన్ ప్లాన్ 2020 లో ఏపీ టాప్ లో నిలువగా…ఈ ఏడాది కూడా నిలిచింది. తాజాగా టాప్ ఎచీవర్స్‌లో 7 రాష్ట్రాలు ప్రకటించింది కేంద్రం. ఈ లిస్టులో… దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్… 97.89 శాతం స్కోర్ తో మొదటి స్థానంలో నిలిచింది.
అలాగే… 97.77 శాతం స్కోర్ తో గుజరాత్ రెండో స్థానంలో నిలిచింది. అటు తెలంగాణ స్కోర్ 94.86 శాతం గా సాధించగా.. తమిళనాడు స్కోర్ 96.97 శాతం సాధించింది. టాప్ అచివర్స్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు గుజరాత్, హర్యానా, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. 4 కేటగిరీలుగా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ర్యాంకులు ఇచ్చింది.
ఇందులో టాప్ అచీవర్స్‌లో స్థానం దక్కించుకుంది ఆంధ్రప్రదేశ్. గతంలో ఎన్నడూ లేని కొత్త విధానాల తో ఈసారి ర్యాంకింగ్ ప్రక్రియ చేపట్టిన కేంద్ర ప్రభుత్వం… 10, 200 మంది పెట్టుబడి దారులు, స్టేక్ హోల్డర్ల నుండి అభిప్రాయాల సేకరణ చేసింది. అన్ని రంగాల్లోనూ సీఎం జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై సానుకూలత వ్యక్తమైంది.