ఉర్దూపై జగన్ సంచలన నిర్ణయం..రెండో భాష గా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ జరిగిన ఏపీ కెబినెట్ లో ఏపీ అధికార భాషా చట్టం 1966కు సవరణకు ఆమోదం తెలిపారు. అంతే కాదు ఉర్దూను రెండో భాష గా గుర్తిస్తూ చట్ట సవరణ చేసింది జగన్ కేబినెట్. 35 అజెండా అంశాలపై ఏపీ కేబినెట్లో చర్చ జరిగింది. విదేశీ మద్యం నియంత్రణ చట్ట సవరణకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
నిజాం పట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం పై కేబినెట్ అంగీకారం తెలిపింది కేబినెట్. టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం కోసం హిందు ధార్మిక సంస్థల చట్ట సవరణకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
మచిలీపట్నం,భావనపాడు, రామాయపట్నం పోర్టుల నిర్మాణం కోసం రూ. 8741 కోట్ల రుణ సమీకరణకు ఏపీ మారిటైమ్ బోర్డుకు హామీ ఉండేందుకు కేబినెట్ ఆమోదం తెలపగా… ఖాయిలా పడిన చక్కెర కర్మాగారాల్లోని ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ అంశానికి కేబినెట్ ఆమోదం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు రూ. 214 కోట్ల వ్యయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.