ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్..ఫీజు చెల్లింపు గడువు పెంచింది ఏపీ సర్కార్. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్మీడియట్ మొదటి, రెండో ఏడాది జనరల్, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఇంటర్ బోర్డు పొడిగించింది. ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు నవంబర్ 30తో గడువు ముగిసింది.
ఈ గడువును మరో ఐదు రోజులు పొడిగిస్తూ గురువారం ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఉత్తర్వులు ఇచ్చారు. రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లింపుకు డిసెంబర్ 5 వరకు అవకాశం కల్పించినట్టు ప్రకటించారు. ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 వరకు చెల్లించవచ్చు. మొదటి, రెండవ సంవత్సరం థియరీ పరీ క్షలకు రూ. 550, రెండో ఏడాది జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్స్ కు రూ. 250, బ్రి డ్జి కోర్సులకు రూ.150 చెల్లించాలి. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.