BREAKING: రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన వ్యక్తి మృతి

-

BREAKING: రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన వ్యక్తి మృతి చెందాడు.ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీ వాసి మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా జగన్నాథపురంకు చెందిన గురుమూర్తి మృతి చెందారు. ఇంకా తెలియని 140 మంది తెలుగువాళ్ల ఆచూకీ లభించలేదు. ఇవాళ ఒడిశా మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు అయ్యాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం….ఒడిశా రైలు ప్రమాదంలో 290కి చేరింది మృతుల సంఖ్య.

ఈ ఘటనాస్థలంలో ఇంకా కొనసాగుతున్నాయి సహాయక చర్యలు. వందల సంఖ్యలో ఇంకా తెలియని ఆచూకీ తెలియరాలేదు. చాలామంది ప్రయాణీకుల సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తోంది.. తమ వారి ఆచూకీ కోసం బంధువుల ఆందోళన చెందుతున్నారు.

ఒడిశా రైలు ప్రమాదంలో మృతులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు అధికారులు. తెలుగు వారిలో ఇంకా తెలియ రాలేదు 141 మంది జాడ. ఇక సురక్షితంగా ఇళ్లకు చేరుకుంటున్నారు పలువురు ప్రయాణీకులు.. ప్రత్యేక రైళ్లలో స్వస్థలాలకు తరలిస్తున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version