ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. రా కదలిరా పేరుతో ప్రచారం ప్రారంభించిన టిడిపి అధినేత చంద్రబాబు బహిరంగ సభలో సీఎం జగన్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టిడిపి చీఫ్ కామెంట్స్ కి వైసీపీ నేతలు సైతం దీటుగా కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఇంటిని టీడీపీ నేతలే తగులబెడుతారు అని మాజీ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేకత ఉండటం వల్లనే సీఎం జగన్ నిరాకరించిన నేతలు టిడిపిలో చేరుతున్నారని తెలిపారు. ఒత్తుతో కలిసి ఎన్నికల బారిలోకి దిగుతున్న టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన తర్వాత టిడిపి నేతలే చంద్రబాబు ఇంటిని తగలబెడతారని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పై చంద్రబాబు పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం సరికాదన్నారు.