AP:2014-15కు సంబంధించి పెండింగ్ లో ఉన్న రూ. 36,625 కోట్ల రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ నిధులను విడుదల చేయాలని ప్రధాని మోదీని సీఎం జగన్ కోరారు.
‘పోలవరానికి రాష్ట్ర ఖజానా నుంచి రూ.2,600 కోట్లు ఖర్చు చేసాం. నిర్మాణం త్వరగా పూర్తయ్యేందుకు రూ. 10,000 కోట్లు మంజూరు చేయాలి. తెలంగాణ డిస్కముల నుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన రూ.7,058 కోట్ల విద్యుత్ బకాయిలు ఇప్పించాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి’ అని విజ్ఞప్తి చేశారు.
అటు..నిన్న రాత్రి కూడా జగన్ నివాసంలో ఆయనతోపాటు బస చేశారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి.ఇక ఈ రోజు ఉదయం నుండి ముహాభావంగా అవినాష్ రెడ్డి ఉన్నారు. పూర్తి నిరాశ నిస్పృహలో అవినాష్ రెడ్డి ఉన్నారని సమాచారం అందుతోంది. ఢిల్లీలోని జగన్ నివాసంలోఎంపీలు పార్టీ నేతలు సహా ఎవరితోనూ అంటి ముట్టనట్టుగానే వ్యవహరించారు అవినాష్ రెడ్డి. తమ సహచర ఎంపీలకు దూర దూరంగా ఉంటున్నారు అవినాష్ రెడ్డి. జగన్ మరో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తప్ప మిగిలిన ఎంపీలు ఎవరితోనూ మాట్లాడటం లేదు అవినాష్ రెడ్డి. ఇక దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.