ఏపీలో కరెంట్ కొరత ప్రజల్ని వేధిస్తోంది. విద్యుత్ డిమాండ్ పెరగడం… అందుకు తగ్గట్లు సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోతలు అమలు అవుతున్నాయి. ఈ పరిస్థితి కేవలం తాత్కాలికమని ఇంధన శాఖ చెబుతున్నా… ప్రజలకు కరెంట్ కష్టాలు తప్పడం లేదు. దీనికి తోడు ఏపీలో పరిశ్రమలకు పవర్ హాలిడే అమలు అవుతోంది.
ఇదిలా ఉంటే కరెంట్ కష్టాలపై ప్రభుత్వ ఫోకస్ పెంచింది. తాజాగా ఇంధన శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయానికి కరెంట్ అందించాలని… ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇంధన శాఖను ఆదేశిచింది. విద్యుత్ సరఫరాపై ప్రత్యేకంగా పర్యవేక్షించి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. విద్యుత్ కొరత కారణంగా పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించామని… అలా ఆదా చేసిన కరెంట్ ను వ్యవసాయానికి, డొమెస్టిక్ అవసరాలకు వినియోగిస్తున్నామని విద్యుత్ శాఖ పేర్కొంది. ఈ నెలఖరు కల్లా కరెంట్ కష్టాలు తీరుతుందని ఇంధన శాఖ వెల్లడించింది.