ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై పూర్తిగా సాధారణ భక్తులకే అనుమతి – ఏపీ దేవదాయ శాఖ

-

దసర సందర్భంగా ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై పూర్తిగా సాధారణ భక్తులకే అనుమతి ఇస్తామని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. వీవీఐపీలు.. వీఐపీలను నియంత్రిస్తున్నాం… 5 స్లాట్సులో వీఐపీలు, వీవీఐపీలకు దర్శనం ఉంటుందని తెలుపారు. ఓ ఎమ్మెల్యేకు రోజుకు ఒక లెటరుకు మాత్రమే అనుమతిస్తాం… ఒక లెటర్ మీద ఆరుగురుకు అనుమతి ఉంటుందని చెప్పారు కొట్టు సత్యనారాయణ.

వీఐపీ స్లాట్సులో మొత్తంగా 2 వేల మందికి టిక్కెట్లు అందుబాటులో ఉంచనున్నాం… ఎమ్మెల్యేల లెటర్ల ద్వారా 600 మందికి అనుమతిస్తే.. 1400 టిక్కెట్లు వీఐపీ టిక్కెట్లు ఆన్ లైన్లో అందుబాటులో ఉంచుతామన్నారు కొట్టు సత్యనారాయణ. ఉదయం 09-10 గంటలకు, సాయంత్రం 05-06 గంటలకు వికలాంగులకు దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని.. 8 ప్రధాన దేవాలయాల్లో ఆన్ లైన్ విధానం అమల్లోకి తేనున్నామన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఎనుమిది ప్రధాన దేవాలయాల్లో ఆన్ లైన్ సేవలు ఉంటాయని.. అక్టోబర్ 10వ తేదీన ధార్మిక పరిషత్ తోలి సమావేశం జరపనున్నామని వెల్లడించారు కొట్టు సత్యనారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news