నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ

-

స్కిల్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అప్పట్లో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించిన విషయం తెలిసిందే. అయితే, తరువాత ఆయనకు కోర్టులో బెయిల్ మంజూరైంది. అయితే, చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. ఈ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ చేపట్టనుంది.

గతంలో ఈ పిటిషన్ విచారణకు వచ్చినపుడు చంద్రబాబుకు బెయిల్ రద్దు ఎందుకు చేయాలి అనే విషయంపై గట్టిగా తన వాదనలు వినిపించింది. ముఖ్యంగా చంద్రబాబు కుటుంబం అధికారులను బెదిరిస్తోందని చెప్పిన ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వెంటనే బెయిల్ రద్దు చేయాలని కోరారు. దీనికి సంబంధించి అన్ని వివరాలతో ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ దాఖలు చేసినట్లు జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనానికి న్యాయవాదులు తెలిపారు. ప్రభుత్వం తరఫున సమర్పించిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ పై తాము సమాధానం ఇవ్వాలని అనుకుంటున్నట్టు చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు. దీంతో విచారణను మూడువారాల పాటు కోర్టు వాయిదా వేసింది. ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version