ఏపీలో ఆర్టీసీ ఛార్జీలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. నిన్ననే ఈ మేరకు ఏపీ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. అయితే.. దీనిపై నారా లోకేష్ తన స్టైల్ లో స్పందించారు. మోసపు రెడ్డి పాలనలో బస్సు ఎక్కడమే అదృష్టంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యధా సీఎం తధా అధికారులు.. ప్రజల్ని మోసం చెయ్యడంలో నిపుణుడైన జగన్ మోసపు రెడ్డిని ఆర్టీసీ అధికారులు ఆదర్శంగా తీసుకున్నారని… నిన్న ప్రకటనకు నేటి బాదుడుకి సంబంధం లేదని మండిపడ్డారు.
పెంపు స్వల్పమేనని ఛార్జీలు భారీగా పెంచడం దారుణం. కిలోమీటర్ల బట్టి ఛార్జీలు పెంచడం వలన ప్రజల పై పెను భారం పడిందని నిప్పులు చెరిగారు. ఇతర సర్వీసుల్లో కి.మీ.ల చొప్పున కనిష్టంగా రూ.30 నుండి గరిష్టంగా రూ.120 భారం పడనుందని… పాస్ లు, ఏసీ బస్సులో బాదుడుకి అడ్డుఅదుపు లేదు. వైసిపి పాలనలో బస్సు ఎక్కడం కూడా అదృష్టంగా భావించాల్సిన దుస్థితి దాపురించిందని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆర్టీసీని ఉద్ధరిస్తానని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ రెడ్డి చేతులెత్తేసి భారమంతా ప్రజలదే అనడం అన్యాయం. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.