తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత విస్మరించినా…రైతు మీద ప్రేమతో ముఖ్యమంత్రి కేసిఆర్ దాన్యం సేకరణ చేస్తున్నారని పేర్కొన్నారు. యాసంగి ధాన్యం నూక శాతం నష్ట భారం ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని రైతులకు భరోసా కల్పించారని వెల్లడించారు.
వరి వేయండని రెచ్చగొట్టి, పక్కకు తప్పుకున్న బీజేపీ నాయకుల మాటలు రైతులు ఇప్పటికైనా అర్దం చేసుకోవాలని కోరారు. ఏ సందర్భంలోనైనా తెలంగాణకు కేసిఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. రైతులు తేమ లేకుండా ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు మంత్రి వేముల. క్వింటాలుకు 1960 రూ.తీసుకొని లాభంతో సంతోషంగా వెళ్ళాలని కాంక్షిస్తున్నానని.. మంచి ధాన్యంలో కిలో తరుగు తీసిన రైస్ మిల్లులు సీజ్ చేస్తామని హెచ్చరించారు మంత్రి వేముల. టీఆర్‌ఎస్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ది సాధ్యమన్నారు.