టీడీపీ మాజీ సర్పంచ్ హత్య..జగన్‌ పై నారా లోకేష్ వివాదస్పద వ్యాఖ్యలు

-

 

టీడీపీ మాజీ సర్పంచ్ హత్య సంఘటన నేపథ్యంలో నారా లోకేష్‌ స్పందించారు. జగన్‌ పై నారా లోకేష్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసిపి మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు నారా లోకేష్‌. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్ళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హత మార్చారని ఆగ్రహించారు.

Nara Lokesh controversial comments on TDP former sarpanch

ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారుని నిప్పులు చెరిగారు నారా లోకేష్‌. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని వెల్లడించారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version