పెన్నా ఉగ్ర రూపం..ఏపీ వాసులకు హెచ్చరికలు

-

ఏపీ వాసులకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. పెన్నా నది ఉగ్ర రూపం..దాల్చింది. దీంతో పెన్నా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక అటు భయం గుప్పెట్లో పెన్నా పరివహక వాసులు ఉన్నారు. అనంతపురం లో కురుస్తున్న వర్షాలకు గండికోటలోకి భారీ వరద నీరు..చేరుతోంది.

దీంతో గండికోట నుంచి మైలవరం కు 55 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు అధికారులు. మైలవరం నుంచి పెన్నా నదికి 60 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. మైలవరం పూర్తి సామర్థ్యం 6.5ల టిఎంసి కాగా, ప్రస్తుతం మైలవరంలో 5.7 టిఎంసి ల వాటర్ నిల్వ ఉంది. గండికోట ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 26.85 టిఎంసిలు కాగా, ప్రస్తుతం గండికోటలో 26 టిఎంసిల నీరు నిలవ ఉంది.దీంతో అప్రమత్తం అయ్యారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version