జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల గురించి స్వయంగా అడిగి తెలుసుకోవడం కోసం జనవాని కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో శనివారం స్వల్ప ఉధృక్తత చోటుచేసుకుంది. ఆదివారం విశాఖలో నిర్వహించనున్న జనవానిలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో విశాఖ గర్జన కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళ్లేందుకు వైసిపి మంత్రులు రోజా, జోగి రమేష్, విడదల రజిని, వై వి సుబ్బారెడ్డిలు విమానాశ్రయానికిి వచ్చారు.
వారి వాహనాలను చూడగానే జనసేన కార్యకర్తలు వాహనాలపై రాళ్లు, చెప్పులు విసిరారు. దీంతో ఒక్కసారిగా ఉధృత వాతావరణం నెలకొంది. ఈ దాడికి పాల్పడిన జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అరెస్టు చేసిన వారిని విడుదల చేసిన తరువాతనే జనవాణిని నిర్వహిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో జనవానికి వచ్చిన జనం వెనుదిరిగారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వినతులు తీసుకువచ్చిన వారు వెళుతుండడంతో కళావాణి ఆడిటోరియం ఖాళీ అవుతుంది.