వైద్య రంగంలో వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ చేతుల మీదగా క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ అవార్డు అందుకున్నారు డాక్టర్ సునీత. క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ, జస్టిస్ కృష్ణ అయ్యర్ ఫ్రీ లీగల్ ఎయిడ్ సెల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
జస్టిస్ వి ఆర్ కృష్ణ అయ్యర్ 108వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. న్యాయ, వైద్య సహా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన పలువురికి ఈ అవార్డుల బహుకరణ కార్యక్రమం జరిగింది. వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న, ప్రత్యేకించి అంటువ్యాధుల నియంత్రణ కు అత్యుత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతులు మీదగా అవార్డు అందుకున్నారు డాక్టర్ సునీత.