చరిత్రలో ఎవరూ చేయలేని యజ్ఞాన్ని ప్రభుత్వం తలపెట్టింది – మంత్రి కొట్టు

-

శ్రీ లక్ష్మీ మహాయజ్ఞనికి మంచి ఆదరణ వస్తుందన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. చరిత్రలో ఎవరు చేయలేని యజ్ఞాన్ని ప్రభుత్వం తలపెట్టిందన్నారు. వేలాదిమంది భక్తులు ఈ యజ్ఞంలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ యజ్ఞంలో పాల్గొన్న భక్తులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో యజ్ఞాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

అన్ని శాఖల సమన్వయంతో యజ్ఞo జరుగుతుందన్నారు. నాలుగు ఆగమనాలకు సంబంధించి.. అత్యుత్తమైన యాగాన్ని నిర్వహిస్తున్నామన్నారు. తమిళనాడు రిత్వికులు కూడా ఈ యజ్ఞంలో పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి , ప్రజలకు మంచి జరగాలని యజ్ఞన్ని తలపెట్టామన్నారు. సీఎం జగన్ మొదటిరోజు సంకల్పం తీసుకున్నారని.. ఆఖరి రోజు పూర్ణాహుతిలో యజ్ఞఫలాన్ని సీఎం జగన్ కు దారబోస్తారని వివరించారు. సీఎం జగన్ ఈ యజ్ఞఫలాన్ని ప్రజలకు అందిస్తారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version