ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు అధికారులు. ఏపీలో వర్షాలు తగ్గినప్పటికీ లోతట్టు ప్రాంతాలలో వరద ముంపు ఎక్కువగానే ఉంది. వరదలు వీపరితంగా ఉన్న అనే పద్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఇవ్వాళ కూడా స్కూళ్లకు హాలిడే ప్రకటించారు కలెక్టర్. అన్ని ప్రభుత్వ అలాగే ప్రైవేట్ పాఠశాలలకు కూడా హాలిడే ఇస్తున్నట్లు వెల్లడించారు.
విద్యార్థులకు సెలవు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్. ఎన్టీఆర్ జిల్లాలోని చాలా స్కూళ్లను పునరావాస కేంద్రాలుగా మార్చినందుకుగాను కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీలోని మిగతా జిల్లాలలో విద్యాసంస్థలు యధావిధిగా నడవనున్నాయి. వాటికి ఎలాంటి హాలిడే లేదు. ఇది గమనించి విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.