తిరుమల వెళ్లే భక్తులకు షాక్..3 రోజుల పాటు ఆ సేవలు రద్దు కానున్నాయి. తిరుమలలో ఈ నెల 17వ తేది నుంచి మూడు రోజులు పాటు వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు జరుగనున్నాయి. దీంతో మూడు రోజులు పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసింది టిటిడి పాలక మండలి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది.
కాగా, తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. ఇవాళ ఉదయం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 76, 945 మంది దర్శించుకున్నారు. అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 33, 844 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2. 67 కోట్లుగా నమోదు అయింది.