వెంకయ్య నాయుడుకు రాష్ట్రపతి పదవి రాకపోవడంపై విజయసాయి సంచలన ట్వీట్

వెంకయ్య నాయుడుకు రాష్ట్రపతి పదవి రాకపోవడంపై విజయసాయి సంచలన ట్వీట్ చేశారు. వెంకయ్య నాయుడు గారికి రాష్ట్రపతి పదవి ఇవ్వాలని ఏపీలో ఉన్న బీజేపీ వాళ్ళు కాకుండా… టిడిపి వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారంటే, దీని భావంబేమి తిరుమలేశా…!? అంటూ టిడిపి పార్టీ కి చురకలు అంటించారు.

అలాగే ఎల్లోమీడియా అయినా ఆంధ్ర జ్యోతి మరియు tv5 ఛానళ్ల పై విజయ సాయి రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ రెండు ఛానళ్లు జర్నలిజం మర్చిపోయి.. ఏపీ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి. తప్పుడు వార్తలు మరియు కథనాలు ప్రచురిస్తూ… ఏపీ పరువు తీస్తున్నారని ఓ రేంజ్లో నిప్పులు చెరిగారు. ఇలాంటి చానళ్లపై తాము కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సాయి రెడ్డి.