ప్రతి రాత్రీ కాళ రాత్రే – ఇదేం ఖర్మ అన్నయ్యా నీకు? అంటూ చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. నిజమే అన్నయ్యా! నిన్ను చూస్తే జాలేస్తుంది. పనికిమాలిన కొడుకు, రాజకీయ భవిష్యత్ శూన్యం, ఓడించిన ప్రజలపై కసి, గట్టిగా తినలేవు, నిద్రపోలేవు. ప్రతి రాత్రీ కాళ రాత్రే – ఇదేం ఖర్మ అన్నయ్యా నీకు? రిటైర్ అయిపోయి దేవాతో ఆడుకో అంటూ ఎద్దేవా చేశారు సాయిరెడ్డి.
పెగ్గు మింగనప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతావు కాని, నీకు అన్నీ అర్థమవుతాయిరా విగ్గూ. ఆ మాత్రం బుర్రలేనివోడివేం కాదు. బ్యాంకులకు వెయ్యి కోట్లు టోపీ పెట్టావు. నీకు రోజుకో స్టయిల్ విగ్గు. బ్యాడ్ టైం స్టార్ట్ అయిందిరోయ్. ఇక తప్పించుకోలేవు. ఏ తీరుగ మా విగ్గురాజుని దయచూచెదవో అని రఘురామపై మరో ట్వీట్ లో విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.