Vijayawada: విజయవాడ దుర్గమ్మ భక్తులకు అలర్ట్. విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేశారు. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉంటుందని ముందస్తుగా విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేశారు అధికారులు. విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు దిగువున ఇప్పటికే మూడు చెట్లు కూలిపోయాయి. ఇక ఆ చెట్లను తొలగిస్తున్నారు సిబ్బంది.
ఇక విజయవాడ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా అధికారులను అప్రమత్తం చేసిన విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్…అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అలెర్ట్ గా ఉండి అవసరమైన సహాయక చర్యలు తక్షణం చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. మ్యాన్ హోల్స్, కరెంట్ తీగల దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలన సూచనలు చేశారు. పొంగే వాగులు, వంకల దగ్గర అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్..