ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ గా రూపొందించిన యాత్ర 2 చిత్రంలో ఆయన సోదరి షర్మిల, బాబాయ్ వై.యస్. వివేకానంద రెడ్డి పాత్రలు లేవటని రఘురామకృష్ణ రాజు గారు వెల్లడించారు. వెదవ పనులన్నీ చేసే వ్యక్తిని యాత్ర 2 సినిమాలో మహా పురుషుడిగా అభివర్ణించడం హాస్యాస్పదంగా ఉందని, యాత్ర చిత్రం అనేది ఒక మంచి మనిషిపై మంచిగా తీసిన సినిమా అయితే, యాత్ర 2 సినిమాలో ప్రతి నాయకుడిని హీరోగా చూపట్టే ప్రయత్నం చేయడం వల్లే సినిమా థియేటర్లకు జనం కరువయ్యారని అన్నారు.
హైదరాబాదులోని మల్టీప్లెక్స్ థియేటర్లలో 200 నుంచి 300 సీట్లు ఉంటే కేవలం నాలుగైదు టికెట్లు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయని, హైదరాబాదు వరకు వెళ్లడం ఎందుకు సార్… కడపలోనే అడ్వాన్స్ టికెట్లు బుకింగ్ చేసుకునేవారు కరువయ్యారని ఒక వ్యక్తి తనకు బుకింగ్ చార్ట్ పంపించారని తెలిపారు. ఈ సినిమాను ఫ్రీగా చూపెట్టినా కూడా జనం చూసేందుకు సిద్ధంగా లేరని, యాత్ర 2 చిత్రం కోసం నిర్మాత 40 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు చేసినా, ప్రేక్షకాధారణకు నోచుకోకుండా అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నారు. ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యిందంటే జగన్ మోహన్ రెడ్డి గారిని జనం తిరస్కరించినట్లేనని రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు.