సామాజిక న్యాయం సీఎం జగన్‌తోనే సాధ్యం: అనిల్

-

దేశ చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను డిప్యూటీ సీఎం చేసింది సీఎం జగన్ మాత్రమేనని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. ఆయా వర్గాలకే 60 శాతం మంత్రి పదవులు కేటాయించారని గుర్తు చేశారు. తిరుపతిలో జరిగిన సాధికారత యాత్రలో మాట్లాడుతూ.. సామాజిక న్యాయం జగన్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని చెప్పారు.

ఇది ఇలా ఉంటె, సైదాపురం మండలంలో వైసీపీ నాయకులు అక్రమ మైనింగ్‌ను తరలిస్తున్నారని స్వయంగా నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనడం వాస్తవం కాదా అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుంది. పెళ్లి కార్యక్రమానికి వెళ్తున్న తనను మా ఇంటి వద్ద పోలీసులు నన్ను ఆపి అరెస్ట్ అరెస్టు చేయడం సిగ్గుచేటు. ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ స్థానిక మంత్రికి సహకరిస్తున్నారు అనడం వాస్తవం కాదా. జగన్‌రెడ్డి ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. మద్యం వ్యాపారంలో 30 వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదన జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పడం వాస్తవం కాదా..? సజ్జల రామకృష్ణారెడ్డి. విజయ్ సాయిరెడ్డి ఆదేశాల మేరకే సిలికా మాఫియా , మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా వంటివి జిల్లాలో యథేచ్ఛగా జరుగుతున్నాయి. 16 మాసాలు జైల్లో ఉన్న విజయ్ సాయిరెడ్డి కూడా మాకు నీతులు వల్లిస్తున్నారు. సైకో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అక్రమ సంపాదనలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.. జగన్మోహన్‌రెడ్డి ఆస్తులను కేంద్రం జప్తు చేయాలి’’ అని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version